హిందూ-ముస్లిం లవ్‌స్టోరీ.. కేదార్‌నాథ్‌పై నిషేధం

విడుదలకు ముందే వివాదాలకు కారణమైన బాలీవుడ్ చిత్రం ‘కేదార్‌నాథ్’పై ఊహించినట్టుగానే నిషేధం వేటుపడింది. సుశాంత్ సింగ్ రాజ్పుత్, సారాఅలీ ఖాన్ నటించిన ఈ మూవీ హిందువుల మనోభావాలను గాయపరచేలా ఉందంటూ ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్, ఉదమ్‌సింగ్ నగర్ తదితర ఏడు జిల్లాల్లో నిషేధం విధించారు.అభిషేక్ కపూర్ దర్శకత్వం వహించిన చిత్రంలో 2013నాటి ఉత్తరాఖండ్ వరదల ఇతివృత్తంతో సాగే ప్రేమకథను చూపారు. ఒక ముస్లిం యువకుడు హిందూ యువతిని ప్రేమించి, ఎదుర్కొన్న కష్టాలతో సాగుతుంది కథ. ఇది హిందూమతానికి వ్యతిరకంగా, లవ్ జీహాద్‌ను ప్రోత్సహించేలా ఉందని, చిత్రాన్ని నిషేధించాలని కేదార్నాథ్ భక్త మండల్ ఉత్తరాఖండ్ హైకోర్ట్ను ఆశ్రయించింది. స్థానిక పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోవలని కోర్టు అధికారులను ఆదేశించడంతో నిషేధం విధించారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఈ  చిత్రం దేశమంతటా ఈ రోజు విడుదలైంది.