కేజ్రీవాల్ తన సినిమా చూపిస్తాడిక.. - MicTv.in - Telugu News
mictv telugu

కేజ్రీవాల్ తన సినిమా చూపిస్తాడిక..

October 26, 2017

ఢిల్లీ సీెం అరవింద్ కేజ్రీవాల్ రాజకీయ, వ్యక్తిగత జీవితంపై సినిమా రానున్నది. ఆ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

‘యాన్ ఇన్‌సిగ్నిఫికంట్ మ్యాన్’ ( An Insignificant Man ) పేరిట వస్తున్న ఈ సినిమా ఒక ప్రయోగాత్మక చిత్రం. ఇంతకీ ఈ సినిమాలో ఏముంది విశేషం అంటారా.. ఇందులో ఆమ్ ఆద్మీ అరవింద్ కేజ్రీవాలే హీరో. హీరో అంటే ఫైట్లు, డ్యూయెట్లుంటాయి కదా.. అవన్నీ సీఎం అయివుండి ఎలా చేస్తాడనే అనుమానం రావచ్చు. కానీ ఇక్కడ కేజ్రీవాల్ రియల్ లైఫ్ హీరోగా చేస్తున్నాడు. 2013లో జరిగిన ఢిల్లీ ఎలక్షన్ల కంపెయిన్ నుండి ఈ సినిమా ప్రారంభమవుతుందట. ఈ సినిమా 2013 నుంచే షూటింగ్ జరుపుకుంటూ తను మళ్ళీ సీఎం అయ్యేవరకు కొనసాగిందట.

కేజ్రీవాల్ చాలా తెలివిగా ఖుష్బూ రంకా, వినయ్ శుక్లా అనే ఇద్దరు డైరెక్టర్లను తన వెంట పెట్టుకొన్నాడు. ఎక్కడ తన కంపెయినింగు నడిస్తే అక్కడ లైవ్ షూట్ చేయించాడు. ఇందులో స్క్రిప్ట్ అంటూ ఏమీ వుండదు. పరిమిత పాత్రలంటూ అనే హద్దులుండవు. ఈ సినిమాలో ఎవ్వరూ ప్రొఫెషనల్ ఆక్టర్స్ కారు. అందరూ లైవ్‌గా చేశారు. నాలుగు కెమెరాలతో ఎక్కడ మీటింగైనా అక్కడ యూనిట్ వుండిపోయేదట. గెరిల్లా షూటింగ్‌లా మొత్తం ముగించేశారు. చుట్టూ వున్న జనాలకు ఇక్కడ షూటింగ్ జరుగుతుందనే అనుమానం కలగకుండా షూట్ చేశారు. నవంబర్ 17న విడుదలకు సిద్ధమైంది.  పలు రాజకీయ పార్టీలకు ఈ సినిమా గురిపెట్టి బాణాలు సంధించనుంది. బుక్ మై షోలో ఈ సినిమాకు సంబంధించిన టిక్కెట్లు అడ్వాన్స్ బుకింగ్ కూడా అప్పుడే మొదలైపోయింది.