నాకు నువ్వు- నీకు నేను - MicTv.in - Telugu News
mictv telugu

నాకు నువ్వు- నీకు నేను

December 4, 2017

తమిళనాడు ఉప ఎన్నికల్లో నామినేషన్  వేసిన విశాల్ మీడియాతో మాట్లాడుతూ  ‘తనకు రాజకీయాల్లో అనుభవంలేదు. రాజకీయాల్లో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాలే నాకు స్పూర్తి’ అని చెప్పాడు. ఆర్కేనగర్ ప్రజల ప్రతినిధిగా వారి గొంతు కావాలనుకుంటున్నానని’ విశాల్ అన్నారు. ఇదిలా ఉంటే కేజ్రీవాల్ విశాల్ రాజకీయ ఆరంగేట్రం గురించి ట్వీట్ చేశారు. ‘రాజకీయాల్లో నీ  ఆగమనం మరింతమంది యువకులకు స్ఫూర్తిగా నిలుస్తుంది. నువ్వు దిల్లీ వచ్చినప్పుడు కలుద్దాం’ అంటూ  ట్వీట్‌ చేశారు.

 

కాంగ్రెస్ నేత ఖుష్బూ కూడా విశాల్ కు ట్విట్టర్లో శుభాకాంక్షలు తెలిపింది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత స్థానంలో ఖాళీ అయిన ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో.. విశాల్ పోటీ చేసేందుకు నామినేషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈరోజు జయలలిత సమాధి దగ్గరకు వెళ్లి నివాళులర్పించిన విశాల్, అనంతరం తన నామినేషన్‌ను వేశాడు. ఆర్కేనగర్ ఉపఎన్నిక డిసెంబర్‌ 21న జరగనుంది. ఈఎన్నికల్లో విశాల్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నాడు. ఈ ఎన్నికల ఫలితాలు డిసెంబర్‌ 24న వెల్లడవుతాయని సమాచారం.