ముఖ్యమంత్రి కారు చోరీ 

సాక్షాత్తూ ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి  కారు చోరీకి గురైన సంఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఉపయోగించే బ్లూ వాగనార్ కారును ఎవరో ఎత్తుకెళ్లారు.  ఢిల్లీ సెక్రటేరియట్‌కు సమీపంలో  కేజ్రీవాల్ కారును పార్కుచేసి  ఉంచారు.  అలా పార్క్ చేసిన కొద్ది సేపటికే కారు అక్కడినుంచి మాయం అయ్యింది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మొబైల్ గా గుర్తింపు పొందిన, ఆ కారును ఎవరు ఎత్తుకెళ్లారో అని పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుల కోసం గాలిస్తున్నారు. గతంలో పర్యటనలకు, ఎన్నిక ప్రచారానికి వెళ్లినప్పుడు,  కేజ్రీవాల్  ఈ కారునే వాడారట, అందులోనే నిద్రపోయేవాడట. ముఖ్యమంత్రి కారునే  ఎత్తుకెళ్లారంటే  వాళ్లెవరో తీస్మార్కాన్ దొంగలు అయ్యుంటారు అని  ఈవిషయం తెలిసినోళ్లు అనుకుంటున్నారు.

SHARE