మేము శబరిమలకు వెళ్ళం… సుప్రీంకు వ్యతిరేకంగా మహిళల ర్యాలీ - MicTv.in - Telugu News
mictv telugu

మేము శబరిమలకు వెళ్ళం… సుప్రీంకు వ్యతిరేకంగా మహిళల ర్యాలీ

October 3, 2018

ప్రముఖ క్షేత్రమైన శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోకి అన్ని వయసుల మహిళలు వెళ్లవచ్చని  సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై కొంత మద్దతు లభిస్తుండగా, వ్యతిరేకత కూడా లభిస్తోంది. ఈ క్రమంలో కొందరు కేరళ రాష్ట్ర మహిళలు తీవ్రంగా వ్యక్తిరేకిస్తున్నారు. దీంతో రాష్ట్రప్రభుత్వ తీరును నిరసిస్తూ, లక్షలాది మహిళలు రోడ్డుపై నిరసన తెలుపుతూ ర్యాలీ నిర్వహించారు. ‘స్వామియే శరణం అయ్యప్పా’ అంటూ  నినాదాలు చేశారు.

ఈ సందర్బంగా మహిళలు మాట్లాడుతూ… ‘మేము శబరిమలకు వేళ్లేది లేదు.  మేము చిన్నతనంలో స్వామిని దర్శించుకున్నాం. తిరిగి ఎప్పుడు దర్శించుకోవాలో మాకు  తెలుసు. ఇతర రాష్ట్రాలకు చెందిన మహిళలు ఎవరైనా స్వామి దర్శనానికి వస్తే తాము అడ్డుకుంటాం’ అని  హెచ్చరించారు.