కన్నుకొట్టిన కుట్టికి సీఎం అండ - MicTv.in - Telugu News
mictv telugu

కన్నుకొట్టిన కుట్టికి సీఎం అండ

February 16, 2018

కన్నుగీటి కవ్వించిన మలయాళ నటి ప్రియా ప్రకాశ్ వారియర్‌కు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్  మద్దుతుగా నిలిచారు. ‘ఒరు ఆడార్ లవ్’ సినిమాలో ఆమె నటించిన  పాట,  హావభావాలు తమ మనోభావాలను దెబ్బతీశాయంటూ హైదరాబాద్‌లో కొందరు ముస్లింలు సినిమా దర్శకుడు ఒమర్ ,నటి ప్రియలపై పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.అయితే ఈ విషయంపై స్పందించిన విజయన్..  తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్టు చేశారు. కళలో భావప్రటన స్వేచ్ఛపై   అసహనాన్ని ఆమోదించే ప్రసక్తే లేదని పేరొన్నారు. ‘మాపిల్ల పాట్టు అనే ముస్లిం సంప్రదాయ పాట ఆధారంగా  పీఎంఏ జబ్బర్ రాసిన ఈ పాటను అప్పట్లో రఫీఖ్ పాడాడు. ఈ పాట 1978లోనే ఆకాశవాణిలో ప్రసారమైంది.. ముస్లింల వివాహల్లో ఈ పాటను దశాబ్దాల కాలం నుంచి పాడుతున్నారు. ఛాందసవాదం, మతతత్వంపై పోరాటానికి కళలు, సాహిత్యం ఆయుధాలు’ అని ఆయన తెలిపారు.