నర్సు లినీ భర్త పెద్ద మనసు… తొలి జీతం విరాళం - MicTv.in - Telugu News
mictv telugu

నర్సు లినీ భర్త పెద్ద మనసు… తొలి జీతం విరాళం

August 16, 2018

ప్రాణాంతక నిపా వైరస్.. కేరళలో కలకలం సృష్టించిన విషయం తెలిసిందే.. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 16 మందిని పొట్టనపెట్టుకుంది. ఈ వైరస్ సోకిన వారికి లినీ అనే నర్సు ఎంతో ధైర్యంతో సేవలందిచింది. ఈ వైరస్ సోకి మృతి చెందింది. లినీ అంకితభావాన్ని గుర్తించిన కేరళ ప్రభుత్వం ఆమె భర్తకు క్లర్క్ ఉద్యోగం ఇచ్చింది. దీంతో బెహ్రెయిన్ లో ఉన్న సజీష్ ఇద్దరు పిల్లలతో కలిసి కేరళకు వచ్చి గత నెలలో ఉద్యోగంలో చేరాడు. నిన్ననే మొదటి నెల జీతం వచ్చింది.

Nurse Lini husband donate his first-month salary to Kerala cm relief fund

భారీ వర్షాలతో అతలాకుతలమైన కేరళను ఆదుకునేందుకు చాలా మంది సెలబ్రిటీలు ముందుకొస్తున్నారు. దీంతో సజీష్ కూడా తన వంతు సాయంగా మొదటి జీతాన్ని కేరళ సీఎం సహాయ నిధికి అందించించాడు.  బుధవారం మంత్రి రామకృష్ణన్‌ను కలిసి చెక్కును అందజేశాడు. సజీష్‌ను పలువురు అభినందిస్తున్నారు. వృత్తిపట్ల అంకిత భావంతో లినీ, మానవత్వంతో స్పందించిన సజీష్ ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలిచారని పేర్కొంటున్నారు.