ఈ హోటల్‌లో ఫ్రీగా భోజనం... - MicTv.in - Telugu News
mictv telugu

ఈ హోటల్‌లో ఫ్రీగా భోజనం…

March 6, 2018

అన్ని దానాల్లోకెల్ల అన్నదానం మిన్న’ అని పెద్దలు అన్నట్టే  ఓ హోటల్‌లో ఉచితంగా భోజనం పెడుతున్నారు. ఈ హోటల్‌లో తిన్నందుకు డబ్బులు చెల్లిస్తే చెల్లించవచ్చు.. లేకపోతే లేదు. కేరళ అళపళ ప్రాంతంలోని పాతిరాల్లిలో ఉన్న ఈ హోటల్‌లో అన్ని హోటళ్ళ మాదిరిగానే టిఫిన్లు, భోజనం లభిస్తాయి. ఈ హోటల్‌లో ఎవరు ఎంత తిన్నా బిల్లు అడగరు.

మీకు ఎంత తోస్తే అంత ఇవ్వొచ్చు,లేకపోతే లేదు.. అని కౌంటర్ దగ్గర ఓ బాక్స్ ఉంటుంది. మీ దగ్గర డబ్బులు లేకపోతే అక్కడి నుంచి  వెళ్లిపోవచ్చని ఉంటుంది. ఉచితంగా నలుగురి కడుపు నింపుతున్న ఈ హోటల్ పేరు ‘ పీపుల్స్ రెస్టారెంట్ ’. ఈ రెస్టారెంట్‌ను ‘ స్నేహజలం ’ అనే సంస్థ ఆదివారం ప్రారంభించింది. ఈ హోటల్ ప్రారంభోత్సవం సందర్బంగా పాల్గొన్న కేరళ ఆర్థిక శాఖ మంత్రి థామస్ ఇజాక్ హోటల్‌ను పొగడ్తలతో ముంచెత్తారు.

ఇదేదో చిన్నపాటి హోటల్‌ అనుకుంటే పొరపాటే. అధునాతన వంటశాలతో కూడిన ఈహోటల్‌లో రెండు వేల మందికి ఆహార పదార్థాలను సిద్ధం చేసే సౌకర్యం ఉంది. వ్యర్థాల నిర్వహణ ప్లాంట్‌, నీటి శుద్ధీకరణ కేంద్రం దీనికి అనుబంధంగా ఉన్నాయి. ఈ హోటల్ కోసం స్నేహజలం దాతలే బిల్డింగ్‌ను కట్టించడం విశేషం.