మందు కొట్టాలంటే  21 కాదు.. 23 ఉండాలి - MicTv.in - Telugu News
mictv telugu

మందు కొట్టాలంటే  21 కాదు.. 23 ఉండాలి

December 7, 2017

కేరళ ప్రభుత్వం మద్యం సేవించేందుకు వయోపరిమితిని పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రస్తుతం మందు తాడగానికి 21 ఏళ్ళుగా ఉన్న వయోపరిమితిని 23కు పెంంచిది.

మద్యం సేవించే యువత సంఖ్య నానాటికీ పెరిగిపోతుండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం పినరయి విజయన్‌ నేతృత్వంలోని ప్రభుత్వం ఓ ఆర్డినెన్స్‌ను జారీ చేసింది. యువతను కట్టడి చేయటానికే వయో పరిమితిని పెంచుతున్నట్టు ప్రకటించింది.

అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం సంపూర్ణ మద్యపాన నిషేధానికి  ప్రయత్నించినప్పటికీ అది కుదరలేదు. మద్యం అమ్మకాలను 2014 లో కేవలం ఫైవ్ స్టార్ హోటళ్ళకే పరిమితం చేస్తూ లైసెన్సులు కూడా జారీ చేసింది. ఉద్యమకారులు ఆ నిర్ణయాన్ని స్వాగతించినప్పటికీ బార్, పబ్‌ యజమానుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. అంతేగాక పర్యాటక రంగంపై కూడా తీవ్ర ప్రభావం చూపింది. 

కాగా ఇప్పుడు ఎల్డీఎఫ్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నేరుగా మళ్లీ లైసెన్సులు జారీ చేయటం ప్రారంభించింది. అందులో భాగంగా ముందుగా త్రీస్టార్‌ హోటళ్లతో పాటు రిసార్ట్స్‌లలో మద్యం అమ్మకాలకు అనుమతి ఇచ్చింది. ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రతిపక్ష కాంగ్రెస్ ఇదొక జిమ్మిక్కంటోంది. మద్యపాన నిషేదాన్ని పక్కన పెట్టి ఏదో నామ్‌కే వాస్తేగా ఈ నిర్ణయం తీసుకొన్నదని విమర్శిస్తున్నది.