మార్కెట్లో హీరోయిన్ కొడుకు బొమ్మలు - MicTv.in - Telugu News
mictv telugu

మార్కెట్లో హీరోయిన్ కొడుకు బొమ్మలు

November 20, 2018

తైమూర్ అలీ ఖాన్ పటౌడీ… సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్‌ల ముద్దుల కొడుకు. పుడుతూనే ఎంతో ఫేమస్ అయ్యాడు. గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో ఎక్కువగా సెర్చ్ చేసిన సెలబ్రిటీ కిడ్ అనే ట్యాగ్ లైన్‌ను కూడా సంపాదించుకున్నాడు. దీనితో తైమూర్ మీడియాలో ఎక్కువగా ఫేమస్ అవుతున్నాడని గ్రహించిన అతడి తల్లిదండ్రులు చదువు విదేశాలలోని బోర్డింగ్ స్కూల్‌కు పంపాలని ఆలోచిస్తున్నారు. ఈ తరుణంలో తైమూర్ రూపంలో బొమ్మలు రావడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. మరి చూడాలి దీనిమీద పటౌడీ దంపతులు ఎలా స్పందిస్తారో.Telugu News kerala Shopkeeper selling taimur toys photo viral in social mediaగతంలో ఐశ్వర్య రాయ్ బచ్చన్, కత్రినా కైఫ్‌ల రూపంలో ఒక కంపెనీ బార్బీ బొమ్మలను తయారుచేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు అలాంటి ప్రయత్నమే తైమూర్ రూపంలో కూడా జరిగింది. కేరళలోని ఒక దూకాణంలో తైమూర్ బొమ్మలు దర్శనమిచ్చాయి. వెంటనే ఒక వ్యక్తి ఆ బొమ్మను ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. దీనితో ఈ తైమూర్ బొమ్మ ఫోటో వైరల్ అయింది.