విగ్రహాలు పెరుగుతాయని భక్తులు విశ్వాసం. కర్నూలు జిల్లా యాగంటిలోని నంది విగ్రహం రోజురోజుకూ పెరుగుతోందని భక్తుల నమ్మకం. అలాగే కేరళలోని కాసర్ గోడ్ జిల్లాలోని మధూర గ్రామంలోని శివాలయంలో ఉన్న వినాయక విగ్రహం కూడా పెరుగుతోందని అక్కడి జనం చెబుతున్నారు. ఈ గణేశుణ్ని చూడ్డానికి ప్రజలు తండోపతండాలుగు వస్తున్నారు.
దీంతో ఆ ప్రాంతం వినాయక నామస్మరణతో మారుమోగుతోంది. గణపతి పెరుగుతున్నాడు కనుక ఈ బొమ్మను బొడ్డ గణపతి అని పిలుస్తున్నారు. మధూర స్థలపురాణం ప్రకారం మధూర అనే మహిళ.. ఈ పెరుగుతున్నవినాయకుడి విగ్రహన్ని కనుగొన్నది. ఆమె పేరు మీదగానే ఈ ఆలయం మధూరాలయంగా ప్రసిద్ది చెందింది. విగ్రహాన్ని ఈ మె తొలిసారి చూసింది కనుక ప్రస్తుతం కూడా తొలి దర్శనాన్ని ఓ మహిళకే కల్పిస్తున్నారు.
విగ్రహాలు పెరుగుతున్నాయనే వార్తలను శాస్త్రవేత్తలు కొట్టిపడేస్తున్నారు. జీవం ఉన్న చెట్లు, పశపక్ష్యాదులు వంటివాటికే పెరుగుదల ఉంటుందని, నిర్జీవమైన రాయి పెరగదని అంటున్నారు.