‘హరివరాసనం’ సరికొత్తగా..   - MicTv.in - Telugu News
mictv telugu

‘హరివరాసనం’ సరికొత్తగా..  

November 21, 2017

విఖ్యాత గాయకుడు ఏసుదాసు అయ్యప్పస్వామిని జోకొడుతూ పాడిన..‘హరివరాసనం..’ పాట కొంత హంగులతో మళ్లీ భక్తుల ముందుకు రానుంది. శబరిమల దేవాలయంలో  ప్రతి రోజు  పవళింపు సేవ సమయంలో అయ్యప్ప స్వామి వారికి ఈ పాటను పాడి వినిపిస్తారు.తాజాగా ఈ గీతానికి కాస్త మార్పు చేసి మళ్లీ రికార్డు చేయడానికి సన్నహాలు చేస్తున్నారు. కేరళలోని ‘ ట్రావెన్ కోర్ దేవస్వం బోర్డు (టీడీబీ) ఈ నిర్ణయం తీసుకుంది.  హరివరాసనం అష్టకాన్ని  అయ్యప్పస్వామికి ‘ఉరక్క పాట్టు (జోలపాట)గా వినిపిస్తారు. ఈ పాటకు ఎన్నో రకాల రూపాలు ఉన్నప్పటికీ  ఏసుదాసు  పాడిన పాటే అందరికీ పరిచయం.

ప్రస్తుతం వినిపిస్తున్న పాట మూలంలో ప్రతి వాక్యంలోనూ ఉన్న‘ స్వామి’  అనే పదం అసలు  పాటలో లేదు. ఓ చోట ‘అవి విమర్ధనం’ అనే పదం విషయంలో ఉచ్ఛారణ లోపం ఉన్నట్టు గుర్తించారు. అందుకే ఈ విషయం గురించి  ఏసుదాసుతో చర్చించామని, ప్రస్తుతం అమెరికాలో ఉన్న ఆయన ఇండియాకు వచ్చిన తరువాత మళ్లీ పాటను రికార్డింగ్ చేస్తామని టీడీబీ అధ్యక్షుడు పద్మకుమార్ తెలిపారు. 1920లో కోనకథు జానకీ అమ్మ అనే మహిళ రచించినట్లుగా చెబుతున్న ‘ హరివరాసనం’ మూలంతో ఎలా ఉందో అలాగే పాడి స్వామి వారికి వినిపించాలన్నదే తమ ఉద్దేశమని   పద్మకుమార్ తెలిపాడు. పద్మకుమార్.. జానకీ అమ్మ వంశస్తుడే.