కాళీమాత అభిషేకానికి మానవ రక్తం కోరుతూ పోస్టర్లు! - MicTv.in - Telugu News
mictv telugu

కాళీమాత అభిషేకానికి మానవ రక్తం కోరుతూ పోస్టర్లు!

March 7, 2018

‘భక్తులూ కదలిరండి, మీ రక్తాన్ని దానం చేయండి. అందరం కలిసి అమ్మవారికి  రక్తాభిషేకం చేసి కాళీమాత అనుగ్రహాన్ని పొందుదాం’ అని పోస్టర్లు కొట్టించి మరీ ఆలయ అధికారులు  రక్తదానం చేయమంటున్నారు. కేరళలోని తిరువనంతపురం జిల్లా పరిధిలో ఈ పోస్టర్లు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. మార్చి 12 న అక్కడ  కాళీమాత ఉత్సవం జరగబోతోంది. 14 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవంలో రెండో రోజు కాళీ మాతకు రక్తాభిషేకం జరపబోతున్నారు. అందుకోసం భారీగా రక్తం కావాలి.  అందుకే అధికారులు ఈ ప్రకటనలు ప్రారంభించారు.

అంతేకాదు ప్రభుత్వ సర్టిఫికేట్ కలిగిన డాక్టర్లే  భక్తుల వద్దకు వచ్చి రక్తాన్ని సేకరిస్తారట. కాళీమాత ఆకలిని తీర్చడానికి ఈ రక్తాభిషేకాన్ని గత 250 సంవత్సరాలుగా ఆలయ పరిరక్షకులు నిర్వహిస్తున్నారని సమాచారం. అయితే రక్తం కోసం పోస్టర్లు వేయడంతో  రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయం చర్చనీయాంశమైంది.