చికెన్ లేక 900ల KFCలు బంద్! - MicTv.in - Telugu News
mictv telugu

చికెన్ లేక 900ల KFCలు బంద్!

February 20, 2018

కేఎఫ్‌సీ చికెన్ ఎంత ఫేసస్సో అందరికీ తెలసిందే. ఎంత దూరం ఉన్నా, ఎంత ధర ఉన్నా కొంతమంది ఓపిగ్గా వెళ్లి లొట్టలేసుకుంటూ తింటారు. అయితే యూకేలో చికెన్ లేక దాదాపు 900 కేఎఫ్‌సీ  రెస్టారెంట్లు మూతపడ్డాయి.

చికెన్‌ సరఫరా చేసేందుకు డీహెచ్‌ఎల్‌ అనే డెలివరీ సంస్థతో కేఎఫ్‌సీ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డెలివరీ సంస్థలో కొన్ని సమస్యలు తలెత్తడంతో కేఎఫ్‌సీలకు చికెన్‌ సరఫరా చాలా ప్రాంతాల్లో నిలిచిపోయింది. దీనితో చాలా చోట్ల కేఎఫ్ సీలను మూసి వేశారు. తాత్కాలికంగా ఏర్పడ్డ అంతరాయానికి క్షమించడని  కేఎఫ్ సీ నిర్వాహకులు కస్టమర్లను కోరారు. త్వరలోనే ఈసమస్యకు పరిష్యారించి మళ్లీ మూతపడ్డ  రెస్టారెంట్లను  తెరుస్తామని  వారు చెప్పారు.