ఖిల్జీకి దాదా సాహెబ్ ఫాల్కే ఎక్సెలెన్స్ అవార్డు - MicTv.in - Telugu News
mictv telugu

ఖిల్జీకి దాదా సాహెబ్ ఫాల్కే ఎక్సెలెన్స్ అవార్డు

April 10, 2018

ఎన్నో వివాదాల నడుమ విడుదలైన ‘ పద్మావత్ ’ సినిమాకి అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డు దక్కింది. ఈ చిత్రంలో అల్లావుద్దీన్ ఖిల్జీ పాత్రలో మెప్పించిన రణ్‌వీర్ సింగ్‌కు ‘ దాదా సాహేబ్ ఫాల్కే ఎక్సెలెన్స్ అవార్డ్ ’ దక్కింది. ఈ అవార్డుకు ఎంపిక చేసినట్టు అవార్డు కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఖిల్జీ పాత్రకు నూటికి నూరుపాళ్ళు న్యాయం చేశాడని విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు రణ్‌వీర్. తన అసమాన నటనతో ఆ పాత్రకు ప్రాణం పోశాడని తిట్టినవాళ్ళే రణ్‌వీర్‌ను మెచ్చుకున్నారు.

భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. దీపికా పడుకొనె టైటిల్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఎన్నో వాద ప్రతివాదాలను సమర్థవంతంగా ఎదరుకొని విడుదలైన ఈ చిత్రానికి ప్రతిష్టాత్మకమైన అవార్డు రావటం చాలా సంతోషంగా వుందని ఆశాభావం ప్రకటించింది చిత్ర యూనిట్.