కెనడా ప్రధాని విందుకు  సిక్క ఉగ్రవాది - MicTv.in - Telugu News
mictv telugu

కెనడా ప్రధాని విందుకు  సిక్క ఉగ్రవాది

February 22, 2018

కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భారత పర్యటనపై  వివాదం అలముకుంది.  వారంపాటు భారత్ పర్యటనకు వచ్చిన ట్రూడో ముంబైలో బస చేశారు. అతడు ఇచ్చిన డిన్నర్‌ ఈవెంట్‌‌కు ఖలిస్థాన్ ఉగ్రవాదిగా ముద్రపడ్డ జస్పాల్ అత్వాల్ హాజరయ్యారు.

అత్వాల్‌తో కలిసి ట్రూడో, అతని సతీమణి సోఫీ కలిసి ఫోటోలు దిగారు.  ఫిబ్రవరి 22న   ట్రుడావ్, అతని కుటుంబంతో కలసి డిన్నర్ చేయాలని అత్వాల్‌కు ఆహ్వానం వెళ్లిందని, ఇది భారత్‌లో కెనడా దౌత్యాధికారి నాదిర్ పటేల్ పేరిట వెళ్లిందని తెలుస్తుండగా, ఆ తరువాత ఆహ్వానాన్ని రద్దు చేసుకున్నప్పటికీ అత్వాల్ ఈ కార్యక్రమానికి వచ్చేశారని అధికారులు అంటున్నారు.

1986 లో ఇంటర్నేషనల్ సిక్ యూత్ ఫెడరేషన్‌లో సభ్యుడైన జస్సాల్ అత్వాల్ వాంకోవర్‌లో మాజీ ఇండియన్ మినిస్టర్ మల్కియత్ సింగ్ సిద్ధూ ప్రయాణిస్తున్న కారుపై కాల్పులు జరిపిన వ్యక్తి. అప్పటి నుంచి అత్వాల్‌పై ఉగ్రవాది ముద్ర పడింది. అలాగే సిక్ యూత్ ఫెడరేషన్‌ను నిషేదించడం జరిగింది. ఇప్పుడాయన జస్టిన్‌తో కలవడం సంచలనం కలిగిస్తోంది. కాగా ట్రూడో తన పర్యటనలో భాగంగా తాజ్ మహల్ సహా అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయం, గుజరాత్‌లోని సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించుకున్నారు. మరో రెండు రోజుల్లో ఆయన పర్యటన ముగిసిపోనున్నది.