రైతుల నోళ్లలో కారం కొట్టిన దళారులు.. ఒక్కరోజే 1500 డౌన్ - MicTv.in - Telugu News
mictv telugu

రైతుల నోళ్లలో కారం కొట్టిన దళారులు.. ఒక్కరోజే 1500 డౌన్

February 22, 2018

ఆరుగాలం కష్టించి పనిచేసి అందరికి అన్నం పెట్టే రైతన్నలను మోసపోని రోజే లేదు. మిర్చి రైతులను దళారు మరింతగా మోసం చేస్తున్నారు.  మిర్చి కొనుగోలు ధరను ఒక్కరోజే రూ. 1500 తగ్గించడంతో ఖమ్మం వ్యవసాయ మార్కెట్ యార్డులో గురువారం  తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. మిర్చి  ధర మొదట రూ. 9,700‌లు ఉండగా  తర్వాత అత్యధికంగా  తగ్గించారు. రూ. 7వేల నుంచి రూ. 8వేల మధ్య కొనుగోలు చేయడంతో రైతుల్లో ఆగ్రహం ఒక్కసారిగా పెల్లుబికింది.క్వింటాలుకు రూ.1500లు నుంచి రూ.1700 ధర తగ్గటంతో రైతులు మార్కెట్‌ కమిటీ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. మార్కెట్‌కు రైతులు సుమారు 70వేల మిర్చి బస్తాలు తీసుకువచ్చారు. తక్కువ ధర నిర్ణయించడంతో మార్కెట్‌ కమిటీ పర్యవేక్షకుడి కార్యాలయాన్ని ముట్టడించారు. వివిధ ప్రజా సంఘాల నేతలు ఈ ఆందోళనకు మద్దతు పలికారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉన్నతాధికారులు రైతు సంఘాల నాయకులతో చర్చలు జరుపుతున్నారు.