రాత్రి పెళ్లి  ఉదయం ప్రమాదం .. పెళ్లికొడుకు మృతి - MicTv.in - Telugu News
mictv telugu

రాత్రి పెళ్లి  ఉదయం ప్రమాదం .. పెళ్లికొడుకు మృతి

March 9, 2018

ఖమ్మం జిల్లా కొణిజెర్ల మండలం పల్లిపాడు వద్ద భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. ఇన్నోవా వాహనం చెట్టును ఢీకొని  ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వర్ధన్నపేటకు చెందిన అచ్చి రామకృష్ణ ప్రసాద్‌కు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన అమ్మాజీ దుర్గతో గురువారం రాత్రి పశ్చిమగోదావరి జిల్లాలోని తణుకులోని ఓ దేవాలయంలో వివాహం జరిగింది.పెళ్లి ఆనంతరం తిరిగి ఇన్నోవాలో వర్థన్నపేటకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో వరుడు రామకృష్ణ ప్రసాద్‌తో సహా  బంధువులు శరత్ , శ్రీదేవి, పద్మలతో డ్రైవర్ వేణు మృతి చెందారు. పెండ్లి కుమార్తె దుర్గతో పాటు బంధువుల పిల్లలు రామన్‌, మహతి, కృష్ణకు గాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి ఏసీపీ ప్రసన్నకుమార్‌, ఎస్సై సురేష్‌లు చేరుకుని విచారణ చేపడుతున్నారు.