మేలి ముసుగులపై ఖాప్ పంచాయితీ వేటు - MicTv.in - Telugu News
mictv telugu

మేలి ముసుగులపై ఖాప్ పంచాయితీ వేటు

February 21, 2018

‘మహిళలు ఇక మీదట బయటకు వచ్చినపుడు మేలి ముసుగును ధరించాల్సిన అవసరం లేదు ’ అని ప్రకటన చేశారు మాలిక్ గథ్వాలా ఖాప్  చీఫ్‌ బల్జీత్‌ మాలిక్. పంచాయతీల పెద్దలు ఇచ్చే తీర్పులు చెల్లవని ఇటీవలే సుప్రీంకోర్టు తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. దీంతో పలు పంచాయతీలు తాము ఎంతో కాలంగా పాటిస్తున్న సంప్రదాయాల విషయంలో వెనక్కు తగ్గుతున్నాయి. హరియాణాలోని అతిపెద్ద ఖాప్ ఈ ప్రకటన చేయటంపై మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.కొన్నేళ్ళుగా వస్తున్న సంప్రదాయానికి ముగింపు పలకాల్సిన సమయం వచ్చిందని  సోనెపత్‌లోని ఘోఘన ప్రాంతంలో చీఫ్‌ బల్జీత్‌ మాలిక్ చెప్పారు. మహిళలు ఇంకా ముఖానికి ముసుగు ధరించడం అనేది అవివేకం అనడం గమనార్హం. ఇలాంటి ముసుగుల వల్ల వారికి శ్వాస తీసుకోవటానికి ఇబ్బందులు ఎదురవుతాయని, చూడటానికి కూడా ఇబ్బంది పడుతున్నారని అన్నారు. కావున దాన్ని నిషేధించినట్టు తెలిపారు.పెద్దవాళ్లను గౌరవించేందుకు సూచకంగా మహిళలు తలపై కేవలం స్కార్ఫ్‌ ధరిస్తే చాలని తెలిపారు.