అతను ఖిల్జీలాంటి వాడు :  జయప్రద - MicTv.in - Telugu News
mictv telugu

అతను ఖిల్జీలాంటి వాడు :  జయప్రద

March 10, 2018

పద్మావత్’ సినిమాలో  విలన్ ఖిల్జీ పాత్రను ఎంత  భీకరంగా చూపించారో ఆ సినిమా చూసినవారికి  తెలుసు. అలాంటి భయంకరమైన విలన్ సమాజ్ వాదీ పార్టీలో ఉన్నాడని మాజీ ఎంపీ జయప్రద వ్యాఖ్యలు చేశారు. సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నేత ఆజాం ఖాన్ పై  ఆమె ఈ విమర్శలు చేశారు. పద్మావత్ సినిమాలో ఖిల్జీని చూసినపుడు నాకు ఆజాం ఖానే గుర్తచ్చాడు అని జయప్రద మండి పడ్డారు.

ఉత్తరప్రదేశ్‌  ఎన్నికల సమయంలో తన ప్రతిష్ఠకు భంగం కలిగించేలా నాపై ఆయన ఎన్నో  దుష్ప్రచారాలు చేశారు. నన్ను మానసిక వేదనకు గురి చేశారు. తన ఫొటోలను ఆభ్యంతరకరమైన రీతిలో మార్ఫింగ్ చేసి సీడీల రూపంలో పంపిణి చేశారు అని జయప్రద  ఆజంఖాన్‌పై ఆరోపణలు చేస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు పద్మావత్ సినిమా చూసినప్పుడు అప్పటి చేదు అనుభవాలు నన్ను మళ్లీ వెంటాడుతున్న భావన కలిగింది.  అజాంఖాన్ ఖిల్జీ పాత్రకు చక్కగా సరిపోతారు అని ఆమె అన్నారు.