ప్రెస్ మీట్ పెట్టి విడాకులిచ్చేసింది.. - MicTv.in - Telugu News
mictv telugu

ప్రెస్ మీట్ పెట్టి విడాకులిచ్చేసింది..

September 11, 2017

ట్రిపుల్ తలాక్ పై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సమయంలో తాజాగా ‘ఖులా’  ద్వారా ఓ ముస్లిం మహిళ తన భర్తకు ప్రెస్ మీట్ పెట్టి మరీ విడాకులు ఇచ్చింది. ఉత్తర ప్రదేశ్ లోని లక్నో ఈ ఉదంతం చోటుచేసుకుంది. సమాజంలో మహిళలకు సమాన న్యాయం జరగడంలేదని, తలాక్’  సంప్రదాయం మహిళ హక్కులను కాలా రాస్తోందని విడాకులిచ్చిన షజాదా ఖాతూన్ మండిపడింది. తన భర్త జుబెర్ ఆలి పెళ్లయిన కొత్తలో బాగానే చూసుకున్నాడని, తర్వాత తనను చాలా హింసించడం, వేధించడం మెుదలు పెట్టాడని తెలిపింది. దీనిపై మత పెద్దలకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో తన భర్త నుంచి విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నాని వెల్లడించింది. ఖులాపై సంతకం చేసి అలీకి పంపినట్టు తెలిపింది. ఖాతూన్ కు ముస్లిం మహిళలు అండగా నిలిచారు. అయితే ఆ మతపెద్దలు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖులా చెప్పి విడిపోవడం మంచిది కాదని  ముస్లిం పర్సనల్  లా బోర్డు ఎగ్జిక్యూటివ్  సభ్యుడు మౌలానా ఖలీద్ రషిద్ ఫిరంగి మహళి అన్నారు. ఖులా ఇస్తున్నట్టుగా మూడు సార్లు నోటీసులు పంపాలని, అతని నుంచి  ఏ విధమైన  స్పందనా రాకపోతే విడాకులు ఇవ్వొచ్చని సూచించాడు.