విడాకులు మీ ఇద్దరి సమస్య కాదు...ఈ కుర్రాడి లేఖనే నిదర్శనం ! - MicTv.in - Telugu News
mictv telugu

విడాకులు మీ ఇద్దరి సమస్య కాదు…ఈ కుర్రాడి లేఖనే నిదర్శనం !

March 12, 2018

భార్య మీద కోపంతో భర్త, భర్త మీద కోపంతో భార్య ఇలా చాలా మంది విడాకులు తీసుకుని  కుటుంబాన్ని చిన్నా భిన్నం చేసుకుంటారు. సమస్యలు అందరికీ ఉంటాయి. ఆలోచించాలే గానీ  వాటికి పరిష్కార మార్గాలు కూడా మన దగ్గరే ఉంటాయి. అంతేకాని అన్ని సమస్యలకు విడాకులు పరిష్కారం కాదు.  విడాకుల వల్ల మీ కుటుంబాలు ఎంత బాధ పడతాయో, మీ పిల్లల మనసులు ఎంత గాయపడతాయో తెలుసా? ఈ వార్త చదివితే అది అర్థమవుతుంది.అమ్మా,నాన్నలు విడాకులు తీసుకుంటారనే బాధ ఆ కుర్రాడిని గత కొన్ని సంవత్సరాలుగా వెంటాడింది. చాలా బాధపడ్డాడు.  చివరకు అమ్మా నాన్నలు విడిపోరు అని తెలియగానే ఆ కుర్రాడి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. వారి విడాకులను కొట్టి వేసిన జడ్జికి  కృతజ్ఞతాపూర్వకంగా ఓ కాగితం అందించాడు ఆ కుర్రాడు. అందులో ఏముందంటే ‘ ప్రతి సమస్యకు ఓ పరిష్కారం ఉంటుంది, ప్రతి నీడకు ఓ వెలుగు ఉంటుంది, ప్రతి బాధకు ఓ స్వాంతన ఉంటుంది, ప్రతి రేపటికి ఓ ప్రణాళిక ఉంటుంది’ అని రాశాడు.

ఆ ఉత్తరం  చూడగానే జడ్జి కళ్లలో నీళ్లు తిరిగాయి. మేం ఎన్నో తీర్పులు చెప్పాం కానీ ఆ పిల్లాడి లెటర్ మాకు లభించిన అరుదైన ప్రశంస అని  జడ్జి అన్నారు. విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కే ఎందరికో ఈ కుర్రాడి లెటర్ కనువిప్పు కావాలి. మీరు విడాకులు తీసుకోబోయే ముందు మీ కుటుంబం గురించి, మీ పిల్లల గురించి  ఒక్కసారి ఆలోచించండి. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. మీ సంసారంలో వచ్చిన కలహాలను, కలతలను కూర్చొని పరిష్కరించుకోండి. మీరు విడిపోతే అది మీ ఇద్దరి సమస్య అవదు. రెండు కుటుంబాల సమస్య, మీ పిల్లల భవిష్యత్తు  సమస్య అవుతుందని మాత్రం మరిచి పోకండి.