రూ.35 కోట్ల డీల్ కొల్లగొట్టిన కిదాంబి శ్రీకాంత్

 భారతీయ స్టార్‌ షట్లర్‌ కిదాంబి శ్రీకాంత్‌ కోట్లు కొల్లగొట్టాడు. క్రికెటర్లను తలదన్నేలా భారీ స్పాన్సర్‌షిప్‌ ఒప్పందాన్ని సొంతం చేసుకున్నాడు. చైనాకు చెందిన స్పోర్ట్స్ బ్రాండ్‌ ‘లినింగ్‌’.. శ్రీకాంత్‌తో రూ.35 కోట్లకు స్పాన్సర్‌షిప్‌ ఒప్పందం కుదుర్చుకుంది. రూ.5 కోట్ల విలువైన క్రీడా సామగ్రిని కూడా అందించనుంది. నాలుగేళ్లపాటు లినింగ్‌-శ్రీకాంత్‌ ఒప్పందం కొనసాగుతుంది. క్రికెట్‌కు మినహాయించి ఇతర ఆటలకు సంబంధించి ఇదే అతిపెద్ద ఒప్పందం కావడం విశేషం.

Telugu News Kidambi Srikanth signs a 35-crore 4-year deal with global Chinese brand .

నిలకడకు, నాణ్యతకు లినింగ్‌ పెట్టింది పేరని.. ఆ రెండూ పుష్కలంగా ఉన్న శ్రీకాంత్‌.. తమకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా అతికినట్టు సరిపోతాడని సంస్థ పేర్కొంది. శ్రీకాంత్‌ మరిన్ని విజయాల సాధించేందుకు తాము తోడ్పాటు అందిస్తామని లినింగ్‌ ప్రతినిధులు చెప్పారు. 2013-14లో లినింగ్‌ బ్రాండ్‌నే ఉపయోగించిన శ్రీకాంత్‌.. ప్రస్తుతం ‘యోనెక్స్‌’ ఎక్విప్‌మెంట్‌ను వినియోగిస్తున్నాడు. లినింగ్‌తో భాగస్వామ్యంతో మరిన్ని విజయాలు సాధిస్తానని శ్రీకాంత్‌ చెప్పాడు.

Telugu News Kidambi Srikanth signs a 35-crore 4-year deal with global Chinese brand, Li-Ning