కిలీమంజారోపై కొత్తకోట కుర్రాడు ! - MicTv.in - Telugu News
mictv telugu

కిలీమంజారోపై కొత్తకోట కుర్రాడు !

August 28, 2017


గట్టిగా ఒక లక్ష్యం అనుకోవాలి గానీ దాన్ని సాధించుకోవడానికి పంచభూతాలు సైతం వెనకొస్తాయి ’ అని ఓ హిందీ సినిమాలో డైలాగ్ వుంది. నిజమే మన కృషి అంత బలంగా వుందంటే తప్పకుండా సక్సెస్ అవుతారు.

అందుకు నిదర్శనమే వనపర్తి జిల్లా కొత్తకోటకు చెందిన బలుమూరు రాఘవేంద్ర. బీటెక్ పూర్తి చేసి ఆపై తన లక్షాన్ని చేరుకునే దిశగా ప్రయాణం సాగించాడు అతడు. సాహసమే అతని వూపిరి. తన ఆశయాన్ని ఎంతెత్తుకైనా వెళ్లి సాధించాలనుకున్నాడు. శిఖరమే అధిరోహించాడు. ఆఫ్రికా ఖండంలోనే అత్యంత ఎత్తైన, ప్రపంచంలో నాల్గవ ఎత్తైన శిఖరం కిలిమంజారోని అధిరోహించాడు.

5,895 మీటర్స్ ఎత్తు గల ఆ పర్వతాన్ని అధిరోహించి తన లక్ష్యంతో పాటు విజయాన్ని సాధించాడు. పర్వతం ఫైన భారత జాతీయ పతాకాన్ని ఎగురవేసి, భారత దేశం మొత్తం గర్వించే విధంగా చేశాడు. లక్ష్యాలను చేరుకోవాలంటే ఎంతో ప్రోత్సహం ఉండాలి.

ప్రోత్సహించే వాళ్లు ఉంటే ఇలాంటి లక్ష్యాలను విజయాలను ఎన్నో అధిరోహించగలరు. మన పతాకాన్ని ప్రపంచ దేశాలకు తెలిసే విధంగా, మన దేశం గర్వించే విధంగా అడుగులు వేయొచ్చు. బలుమూరు రాఘవేంద్రలాంటి తెలంగాణ కుర్రాడి విజయం ఎందరికో పట్టుదల కలిగించే స్ఫూర్తిని ఇవ్వాలి. మరికొందరికి ఆదర్శం కావాలి, ప్రభుత్వాలు కూడా అతణ్ని గుర్తించాలని కోరుకుందాం.