అయ్యప్ప పూజలో బీజేపీ  కిషన్ రెడ్డి బిజీ బిజీ... - MicTv.in - Telugu News
mictv telugu

అయ్యప్ప పూజలో బీజేపీ  కిషన్ రెడ్డి బిజీ బిజీ…

December 10, 2017

ఈరోజు బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి  ఆయన నివాస ప్రాంగణంలో అయ్యప్ప పూజలో నిమగ్నమయ్యారు. గత  19 సంవత్సరాలుగా ఆయన ఇంటివద్ద  అయ్యప్ప మహాపడి పూజను కిషన్ రెడ్డి నిర్వహిస్తున్నారు. లోక కళ్యాణం కోసం ఇన్ని సంవత్సరాలుగా తాను అయ్యప్ప పూజలు చేస్తున్నట్లు  కిషన్ రెడ్డి  చెప్పారు.

ఈ కార్యక్రమానికి  వేలాదిగా అయ్యప్ప భక్తులు హాజరయ్యారు. తాను  ఎమ్మేల్యే కాకముందు నుంచే  అయ్యప్ప భక్తుడినని కిషన్ రెడ్డి ఈసందర్బంగా తెలియజేశారు. ఎంతో భక్తి శ్రద్దలతో, నియమ నిష్ఠలతో అయ్యప్పను కొలుస్తామని కిషన్ రెడ్డి  తెలియజేశారు.