సినిమాల్లో ముద్దు పెడతావుగా… నాకూ పెట్టు! - MicTv.in - Telugu News
mictv telugu

సినిమాల్లో ముద్దు పెడతావుగా… నాకూ పెట్టు!

December 7, 2017

సినిమాల్లో హీరోయిన్లు ముద్దు పెట్టుకున్నారు.. వాటేసుకున్నారు అని నిజ జీవితంలో కూడా ఎవరు పడితే వారు ముద్దులు, కౌగిలింతలు అడగొచ్చా ? అది నటన.. ఇది జీవితం. కానీ నటి అదాశర్మ విషయంలో ఓ అభిమాని ఆమెను సినిమాల్లో హీరోలకు ముద్దిచ్చినట్టు నాకూ ముద్దివ్వమని వెంట పడ్డాడు. అదీ ఆమె తండ్రి వయసున్నవాడు.

ముంబై ఎయిర్‌పోర్ట్‌లో అదాను చూసిన అతను ఆమె వద్దకు వెళ్లి ‘ నువ్వు నా కూతురులాంటి దానివి. ఓ ముద్దు ఇవ్వవా ’ అని అడిగాడు. అదా అతని అభ్యర్థనకు షాకైపోయింది. అతను అడిగిన దానికి నవ్వుకుని  వెళ్లిపోతుంటే ఆమె వెనక వెనక వెళ్తూ  ‘ సినిమాల్లో అన్నేసి గంటలపాటు ముద్దుపెడతావు. కానీ, నాకు పెట్టవా.. ఇదేం అన్యాయం..  ’ అంటూ కేకేలేస్తూ నానా హంగామా చేశాడు. అతను అలా అరుస్తున్నప్పుడు కొందరు ప్రయాణికులు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దాంతో కొందరు నెటిజన్లు అదాకు మద్దతుగా కామెంట్లు పెడుతుంటే మరికొందరు మాత్రం ‘ అభిమానికి ముద్దివ్వడానికి ఏంటి ? ’ అంటూ విమర్శించారు.

అభిమాని అంటే ఆటోగ్రాఫో, సెల్ఫీయో తీసుకొని వెళ్ళిపోతే బాగుంటుంది. కానీ ఇలా ముద్దులు, ముచ్చట్లు అడిగితే చాలా అసహ్యంగా వుంటుందంటోంది అదా. తన ట్విట్టర్లో ఈ ఘటనకు సంబంధించి ఆగ్రహంతో ట్వీట్ చేసింది. ‘ నేను ఫలానా సినిమాలో ముద్దిచ్చానని అడుగుతున్నాడు సరే.. 1920 సినిమాలో దయ్యంగా చేశాను. మరి ఆ పాత్ర ప్లే చేసి పీక నులిమి చంపెయ్యమని అడగరే ? ’ అంటూ ట్విట్టర్లో నిప్పులు చెరిగింది అదాశర్మ.