పెరేడ్ గ్రౌండ్స్‌లో పతంగుల పండగ.. 3రోజులు తియ్యని వేడుకే

సంక్రాంతి పండగను పురస్కరించుకుని నగరవాసులకు కనువిందును, నోటికి తియ్యటి విందును ఇస్తోంది తెలంగాణ రాష్ట్ర టూరిజం శాఖ. పండగ సందర్భంగా పలు వేడుకలు నిర్వహిస్తోంది. అంతర్జాతీయ పతంగులు, మిఠాయిల వేడుకలను నిర్వహిస్తోంది. ఈ వేడుకల్లో వివిధ దేశాలకు చెందని పతంగులు, మిఠాయిలు సందడి చేయనున్నాయి. నేటి నుంచి మూడు రోజులపాటు జరిగే ఈ వేడుకలకు సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్ వేదిక కానుంది. ఈ సందర్భంగా పరేడ్ మైదానాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఈ అంతర్జాతీయ వేడుకలను నేడు ప్రారంభించనున్నారు.

Telugu news, Kites festival at Parade Grounds .. 3 days sweet Celebrations.

ఈ వేడుకల ప్రత్యేకత…

ఈ వేడుకల్లో మొత్తం 20 దేశాల నుంచి సుమారు 42 మంది అంతర్జాతీయ స్థాయి పతంగుల ఆటగాళ్లు, 60 దేశవాళీ పతంగుల క్లబ్స్ సభ్యులు హాజరుకానున్నారు. ఇక అంతర్జాతీయ మిఠాయిల వేడుకల్లో  22 దేశాలకు చెందిన వారు పాల్గొంటున్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన 2,500 మంది తయారు చేసిన 1200 రకాల స్వీట్ వెరైటీలను ప్రదర్శించడంతో పాటు అమ్మకాలు కూడా చేయనున్నారు. Telugu news, Kites festival at Parade Grounds .. 3 days sweet Celebrations