ఎర్రగడ్డలో  ప్రేమోన్మాది - MicTv.in - Telugu News
mictv telugu

ఎర్రగడ్డలో  ప్రేమోన్మాది

October 23, 2017

ఎర్రగడ్డ రైతు బజార్‌లో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. స్రవంతి అనే వివాహితను గత కొంతకాలంగా రవి అనే వ్యక్తి ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. అతని వేధింపులు తట్టుకోలేక గతంలో ఆమె ఎస్సార్‌నగర్ పోలీస్ స్టేషన్లో రెండు సార్లు ఫిర్యాదు కూడా చేసింది. అయినా తన బుద్ది మార్చుకోలేని రవి, ఈరోజు ఉన్మాదిగా మారి, ఎర్రగడ్డ రైతు బజార్ దగ్గర నడుచుకుంటూ వెళ్తున్న స్రవంతిపై కత్తితో దాడి చేసి, పొడిచాడు. తీవ్ర గాయాలపాలైన స్రవంతిని గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. దాడి చేసిన రవిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.