mictv telugu

అమ్మకు మెట్రో జేజేలు.. స్తన్యమిచ్చుకోడానికి డబ్బాలు

February 12, 2019

బహిరంగ ప్రదేశాల్లో పిల్లలకు స్తన్యమివ్వడానికి తల్లులు పడే కష్టాలు అన్నీఇన్నీ కావు. కాకుల్లా పొడుచుకు చూసే కామాంధులు, ఇక్కడ అలాంటి పనులు చేయకూడదంటూ దుకాణాల యజమానులు.. మరెందరో వారిని వేధిస్తుంటారు. దీనికి తిరుగుబాటుగా వచ్చిందే ఓపెన్ బ్రెస్ట్ ఫీడింగ్. పాశ్చాత్య దేశాల్లో ఒదో ఉద్యమంలా మారినా, మనదేశంలో మాత్రం ఇంకా పాలుపట్టే తల్లుపై వివక్ష కొనసాగుతూనే ఉంది.  Telugu news Kochi Metro Installs Breastfeeding Pods: 4 Other Times KMRL Led by Example!ఈ నేపథ్యంలో కొచ్చి మెట్రో రైల్ లిమిటెట్ ఆహ్వానించదగ్గ నిర్ణయం తీసుకుంది. స్టేషన్లలో తల్లులు తమ బిడ్డలకు స్తన్యమివ్వడానికి ప్రత్యేక డబ్బాలను ఏర్పాటు చేసింది. తల్లులు అందులోని కుర్చీల్లో కూర్చుని బిడ్డలకు చక్కగా పాలు పట్టొచ్చు. వారి గోప్యతకు భంగం రాదు కూడా. వీటి ఏర్పాటుపై నగర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇవి ప్రయాణికులకే కాకుండా మెట్రోలో పనిచేస్తున్న తల్లులు కూడా వాడుకోవచ్చు. ఒక్కో డబ్బా ఖరీదు రూ. 1.5 లక్షలు. లోపల ఫ్యాను, హ్యాండ్ వాష్, లైట్లు, మొబైల్ ఫోన్ చార్జింగ్ సదుపాయం కూడా ఉన్నాయి. కొచ్చి మెట్రో గతంలోనూ కొన్ని మంచిపనులు చేసింది. ట్రాన్స్ జెండర్లను.. టికెట్ కౌంటర్, ఇతర విభాగాల్లో నియమించింది.