జనగామ నుంచి బరిలోకి కోదండరాం…

మహాకూటమిలో టీజేఎస్‌కు మొత్తం 8 స్థానాలు కేటాయించినట్టు కాంగ్రెస్ రాష్ట్రవ్యవహరాల బాధ్యుడు కుంతియా గురువారం ఢిల్లీలో ప్రకటించిన విషయం తెలిసిందే. తమకు కేటాయించిన 8 సీట్లూ తాము కోరుకున్నవే ఇవ్వాలని కోదండరాం కోరినట్టు తెలుస్తోంది. అయితే తెలంగాణ జనసమితి అధినేత కోదండరాం ఎక్కడినుంచి పోటీ చేస్తారనే విషయంలో కొన్ని రోజులుగా సందిగ్ధత నెలకొనివుంది. కాగా, కోదండరాం ఎక్కడినుంచి బరిలోకి దిగుతున్నారనేదాని మీద క్లారిటీ వచ్చేసింది. ఆయన జనగామ నుంచి ఎన్నికల బరిలోకి దిగనున్నారు.Telugu news Kodandaram Coming from Jaganama to the ring … Janardhan Reddy from Medak, Bhavani from Siddipet..జనగామ నుంచి కోదండరాం పోటీ చేయనుండగా, మెదక్ బరిలో జనార్దనరెడ్డి, సిద్దిపేట నుంచి భవాని, దుబ్బాక నుంచి రాజ్‌కుమార్, మహబూబ్‌నగర్ నుంచి రాజేందర్ రెడ్డి,  మల్కాజిగిరి నుంచి కపిలవాయి దిలీప్ కుమార్, మేడ్చల్ నుంచి హరివర్ధన్ రెడ్డి పేర్లు ఖరారయ్యాయని తెలుస్తోంది. వర్ధన్న పేట అభ్యర్థి పేరు ఖరారు కావాల్సి ఉంది. వరంగల్ తూర్పు స్థానం కోసం టీజేఎస్ పట్టుబడింది. అక్కడి నుంచి ఇన్నయ్యను బరిలోకి దింపాలని కోదండరాం అనుకున్నారు. సీట్ల సర్దుబాటు కారణంగా ఆ స్థానాన్ని టీడీపీకి కేటాయించారు.