కాంగ్రెస్,బీజేపీలు కలిసాయి..కలిపింది కోదండరాం - MicTv.in - Telugu News
mictv telugu

కాంగ్రెస్,బీజేపీలు కలిసాయి..కలిపింది కోదండరాం

November 25, 2017

అది చూడడానికి రౌండ్ టేబుల్ సమావేశం, కానీ అక్కడ ఏదో కొత్త ప్లాన్  రూపొందించినట్టు  అర్ధమవుతోంది. ‘ప్రజా తెలంగాణ’ అనే సంస్థ  సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో  కాంగ్రెస్, బీజేపీల ప్రతినిధులు పాల్గొన్నారు.

కేసీఆర్‌ను తిట్టడమే  ఎజెండా గా సాగిన ఈసమావేశంలో ప్రభుత్వ తీరును ఈరెండు రాజకీయ పార్టీలు  ఒకే గొంతుగా మారి తిట్టాయి. కోదండరాం వారికి వంత పాడారు. రెండు పార్టీలు ఐక్యంగా ప్రజా సమస్యలపై కొట్లాడాల్సిన అవసరాన్ని ఆయన పదే పదే గుర్తు చేశారు. అసలు ఈరౌండ్ టేబుల్ ఉద్దేశ్యం జేఏసీ తలపెట్టిన ‘కొలువలకై కొట్లాట’ సభను విజయవంతం చేయడం.

ఇప్పుడున్న పరిస్థితుల్లో కేసీఆర్‌ని ఎదుర్కోవాలంటే, అన్నీ రాజకీయ పక్షాలు జెండాలను పక్కన పెట్టి కలిసి కట్టుగా కొట్లాడాలనే వ్యూహాన్ని ఈసమావేశంలో  ఒక మౌకిక అంగీకారానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఈఐక్యత సమస్యలపై పోరాడడం వరకే అనేది కోదండరాం వారికి స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.

ఇకముందు నుంచి సమస్యలను ప్రజల్లోకి కలిసి కట్టుగా తీసుకుపోతే ఎన్నికల సమయానికి అన్ని రాజకీయ పార్టీలు లబ్ధి పొందే అవకాశముందని  కోదండరాం వారికి పొలిటికల్ క్లాస్ చెప్పినట్టు సమాచారం.

ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ లు కలవవని తెలిసినా..కలిసి  కొట్లాడాలని ఎందుకు ప్రయత్నిస్తున్నాయో ఎవ్వరికి అర్ధంకాని ప్రశ్న. ఈప్రశ్నకు కోదండరాం మాత్రమే సమాధానం చెప్పగలరు.