కోనవెంకట్ నన్ను గెస్ట్‌హౌస్‌కు పిలిచి బలాత్కారం చేయాలని చూశాడు.. - MicTv.in - Telugu News
mictv telugu

కోనవెంకట్ నన్ను గెస్ట్‌హౌస్‌కు పిలిచి బలాత్కారం చేయాలని చూశాడు..

April 12, 2018

టాలీవుడ్ బట్టలు ఊడదీసి నిగ్గుదీస్తున్న శ్రీరెడ్డి ఇప్పుడు సంచలనంగా మారింది. ఆమె ఎవరి పేరు బయట పెడుతుందా అనే ఉత్కంఠతతో టాలీవుడ్ ప్రముఖుల నరాలు బిగుసుకుంటున్నాయి. మొన్న నిర్మాత డి. సురేష్ బాబు కొడుకు అభిరామ్ పేరును, నిన్న నిర్మాత దిల్‌రాజు పేరును బయట పెట్టింది శ్రీరెడ్డి. నెక్ట్స్ ఎవరా అని చాలా మంది ఎదురు చూస్తుండగా శ్రీరెడ్డి ఓ మహానుభావుడి పేరు బయట పెట్టింది. ఆయనే కోన వెంకట్. అప్పట్లో స్టార్ రైటర్‌గా పేరు సంపాదించుకున్న ఆయన చీకటి మనస్తత్వం గురించి శ్రీరెడ్డి నమ్మలేని నిజాలను తెలిపింది.‘ మంచి రైటర్ అని నాకు కోన వెంకట్ మీద చాలా గౌరవం వుండేది. కానీ ఎంతైనా మగాడు కదా. మేడిపండు చూడు మేలిమై వున్నట్టే వుంటారు. పొట్ట విప్పితే గానీ ఇలాంటివాళ్ళ అసలు స్వరూపాలు తెలియవు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని శ్మశానం వెనుక కోన వెంకట్‌కు ఓ గెస్ట్‌హౌస్ వుంది. ఒకరోజు రాత్రి 9 గంటలకు ఆయన నాకు ఫోన్ చేసి తన గెస్ట్‌హౌస్‌కు రమ్మన్నారు. దర్శకుడు వివి. వినాయక్ నా గెస్ట్‌హౌస్‌కు వస్తున్నారు పరిచయం చేయిస్తానని చెప్పడంతో వెళ్ళాను. అవకాశం ఇస్తారనే ఆశ తప్ప నాకు వేరే ఏమీ తెలియదు. అక్కడకు వెళ్లిన తర్వాత మందు తాగుతావా అని కోన అడిగాడు. నాకు అలవాటు లేదని చెప్పాను. వివి. వినాయక్ రావటానికి టైం పడుతుంది అంతలోపు మందు తాగుదామని చెప్పాడు.  ఆ తర్వాత నన్ను శారీరకంగా బలవంతం చేశాడు. ఇందుకు సంబంధించిన ఆధారాలు నా దగ్గరు వున్నాయి. నిరూపిస్తాను ’ అని శ్రీరెడ్డి తెలిపింది.

కాగా శ్రీరెడ్డి తనమీద చేసిన ఆరోపణలు నిరాధారమైనవని కోన వెంకట్ కొట్టి పారేశారు. ఆమె ఆరోపణలపై పోలీసు విచారణ జరిపించాలని… దోషులను కఠినంగా శిక్షించాలని అన్నారు. చీప్ పబ్లిసిటీ కోసం శ్రీరెడ్డి ఇలాంటి ఆరోపణలకు తెగబడుతోందని అన్నారు. ఇదిలా వుండగా సోషల్ మీడియాలో శ్రీరెడ్డి బయట పెట్టిన కోన వెంకట్ బుద్ధి ఇంత చీపా అని కామెంట్లు చేస్తున్నారు. ‘ సినిమాల ద్వారా నీతులు చెప్పి, కలం ద్వారా ఎన్నెన్నో మంచి మాటలు రాసిన ఒక గొప్ప సినీ రచయిత ఇంతటి నీచుడా ’ అని కామెంట్ల మీద కామెంట్లు చేస్తున్నారు.