’దంగల్’ను దాటిపోయిన  ‘మెర్సల్’ - MicTv.in - Telugu News
mictv telugu

’దంగల్’ను దాటిపోయిన  ‘మెర్సల్’

October 20, 2017

తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన తాజా చిత్రం ‘మెర్సల్’. ఇది తెలుగులో ‘అదిరింది’గా విడుదలై భారీ వసూళ్లతో  దూసుకుపోతోంది. సెన్సార్ నుంచి ఎన్నో అడ్డంకులను దాటుకుని విడుదలైన ఈ చిత్రం విజయ్ కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కింది. అత్యధిక థియేటర్లలోనూ రీలిజ్ అయింది. ఏకంగా అమెరికాలోనే 132 చోట్ల విడుదలైంది. తొలిరోజు వసూళ్లలో  ‘దంగల్’, ‘రాయిస్’ వంటి బాలీవుడ్ చిత్రాల రికార్డులను బద్దలు కొట్టిందని ఫోర్బ్స్ పత్రిక తెలిపింది. మంగళవారం విడుదలైన ఈ చిత్రం అమెరికాలో తొలిరోజు వసూళ్లు  ఏకంగా 3,57,925(రూ. 2.3 కోట్లు). ఈ మొత్తం ఆ దేశంలో దంగల్ తొలి రోజు వసూళ్లకంటే కంటే ఎక్కువ. దంగ్ తొలి రోజు వసూళ్లు.. రూ. 2.1 కోట్లు.అయితే మహేశ్ బాబు నటించిన ’స్పైడర్‘ను మాత్రం మెర్సల్ దాటలేకపోయింది. అమెరికాలో, ప్రీమియర్స్ కలుపుకొని తొలి రోజు స్పైడర్ 10 లక్షల డాలర్లను(రూ. 6.5 కోట్లు) సాధించి సంచలనం సృష్టించింది. అయితే ‘బాహుబలి2’  కలెక్షన్లు ఈ సినిమాలేవి బ్రేక్ చేయలేకపోతున్నాయి. ‘బాహుబలి2’ తొలిరోజు అత్యధికంగా 55 లక్షల డాలర్లును సాధించింది. ఇక మెర్సల్ భారత్‌లో తొలిరోజు రూ. 33 కోట్లను వసూలు చేసింది.