కొండగట్టు మరో విషాదం.. 4 నెలలు పోరాడి ఓడింది… - MicTv.in - Telugu News
mictv telugu

కొండగట్టు మరో విషాదం.. 4 నెలలు పోరాడి ఓడింది…

January 9, 2019

మృత్యువుతో పోరాడి ఓడిపోయిందామె. చివరి వరకు బతుకుతుందనుకున్న ఆమె కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. కొండగట్టు ఘాట్‌రోడ్డులో జరిగిన బస్సు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై కొన ఊపిరితో చికిత్స పొందుతున్న మహిళ మృత్యువుతో సుమారు 4 నెలల పోరాటం చేసి సోమవారం అర్ధరాత్రి మృతిచెందింది. 11 సెప్టెంబరు 2017న జగిత్యాల జిల్లా కొండగట్టువద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే.

Telugu news Leaving the water on roads From 2 thousand to 2 lakh fine …..

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం డబ్బుతిమ్మయ్యపల్లెకు చెందిన సురకంటి హరితకు(35) ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలయ్యాయి. డబ్బుతిమ్మయ్యపల్లెలో   సాక్షరభారత్‌ సమన్వయకర్తగా పని చేస్తున్న హరిత ఆరోజు జగిత్యాల జిల్లా కేంద్రంలో జరుగుతున్న సాక్షరభారత్‌ సమన్వయకర్తల సమ్మెకు హాజరయ్యేందుకు బస్సులో వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది.

వెంటనే ఆమెను హైదరబాద్‌కు తరలించి అత్యవసర చికిత్స అందించారు. అనంతరం కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. నెల రోజుల కిందటే ఇంటికి తీసుకువచ్చారు. అప్పటినుంచి ఆమె కొనఊపిరితో పోరాడుతూ ఇంట్లోనే చికిత్స పొందుతోంది. ఈ క్రమంలో ఆమె ఆరోగ్యం మరింత విషమించి సోమవారం రాత్రి మృతి చెందారు. హరిత మృతితో కొండగట్టు ప్రమాద మృతుల సంఖ్య 65కు చేరింది. మృతురాలికి భర్త సంజీవరెడ్డి, పదవ తరగతి చదువుతున్న కుమారుడు ఆదిత్యరెడ్డి ఉన్నారు. Telugu news Kondagattu Another tragedy..  Lost for 4 months fighting …