కోపర్ది మృగాళ్లకు మరణశిక్ష - MicTv.in - Telugu News
mictv telugu

కోపర్ది మృగాళ్లకు మరణశిక్ష

November 29, 2017

గత సంవత్సరం మహారాష్ట్రలోని కోపర్దిలో ఓ మైనర్ బాలికను ముగ్గురు అతి దారుణంగా అత్యాచారం చేసి, హిసించి చంపేసిన ఘటన సంచలనం సృష్టించింది. ఈ మృగాళ్లకు  అహ్మద్‌నగర్ జిల్లా సెషన్స్ కోర్టు బుధవారం ఉరిశిక్షను విధించింది.

2016 జులై 13న కోపార్ది గ్రామానికి చెందిన 15 ఏళ్ల మైనర్ బాలికను జిత్రేంద, సంతోష్‌, నితిన్‌ అనే ముగ్గురు వ్యక్తులు ఎత్తుకుపోయి, ఆమెపై అతి కిరాతకంగా రేప్ చేసి చంపేశారు. రక్తమోడుతున్న బాలిక మృతదేహాన్ని గ్రామానికి దగ్గర్లోని ఒక చెట్టు దగ్గర ప్రజలు గుర్తించారు. బాలిక ఒంటినిండా పంటిగాయాలు ఉండటమేగాక.. కాళ్లూ, చేతులు కూడా విరిగిపోయాయి.

దోషులను కఠినంగా శిక్షించాలంటూ రాష్ట్రవ్యాప్తంగా  ప్రజలు పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. దాదాపు 18 నెలల తర్వాత దోషులకు ఉరిశిక్ష పడింది. ఇది అత్యంత అరుదైన కేసుల్లో ఒకటని, బాలికను అతిదారుణంగా హింసించి చంపారు. అందుకే  నిందితులకు ఉరి శిక్షే సరైన శిక్ష అని కోర్టు తన తీర్పులో వెల్లడించింది.