బాల్కనీలో బుల్లి లిఫ్ట్.. ప్రమాదంలో శ్రీరామరక్ష

ప్రపంచ జనాభా పెరిగిపోతోంది. జనం నివసించడానికి నగరాల్లో భూమి సరిపోవడం లేదు. ఎత్తైన భవంతులు నిర్మించుకుని పిట్టల్లా జీవిస్తున్నారు. ఈ బహుళ అంతస్తుల భవనాలతో సమస్యలు కూడా ఉన్నాయి. ఒక్కో భవంతిలోని అన్ని ఫ్లోర్లు మెట్ల ద్వారా ఎక్కాలంటే ఎంతో కష్టం. అందుకు లిఫ్టులు వాడుతున్నారు. అయితే అవీ సరిపోవడం లేదు. లిఫ్ట్ కోసం నిమిషాల పాటు వేచిఉండాల్సిన పరిస్థితి. సాధారణ సమయాల్లోనే ఈ పరిస్థితి ఉంటే మరి ఎమర్జెన్సీ సమయంలో పరిస్థితిని అసలు ఊహించలేం.

ఎమర్జెన్సీ బాల్కనీ లిఫ్ట్…

భవనాల్లో లిఫ్ట్‌తో పాటు ఎప్పుడైనా అగ్నిప్రమాదం సంభవిస్తే లేదా కరెంట్ సరఫరా ఆగిపోతే ఎలాంటి ఇబ్బందీ కలుగకుండా మెట్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అయతే అన్నేసి మెట్లను ఎక్కడం కూడా కష్టమే. దీనికి పరిష్కారంగా కొరియాకు చెందిన నేరిగో అనే కంపెనీ బాల్కనీ పర్సనల్ లిఫ్ట్‌ను రూపొందించింది. ఇది కరెంటు లేకుండా పనిచేస్తుంది. అపార్ట్మెంట్‌లోని ప్రతి ఫ్లాట్ బాల్కనీలో దీనిని అమరుస్తారు. దీనిపై పెద్దలైతే ఒక్కరు, పిల్లలైతే ఇద్దరు ప్రయాణించవచ్చు. ఇది కేవలం పై ఫ్లోర్ నుండి కింది ఫ్లోర్‌‌కి దిగడానికి మాత్రమే ఉపయోగపడుతుంది తప్ప కింది ఫ్లోర్ నుండి పై ఫ్లోర్‌కి ఎక్కడానికి పనిచేయదు. ప్రతి ఫ్లోర్‌కు రెండు వేర్వేరు దారులు ఉంటాయి. పైకి, కిందకు తిరిగే చిన్న బేస్‌లు ఉంటాయి. స్టీల్ రాడ్లు ఆధారంగా ఇవి పైకి, కిందకు కదులుతుంటాయి. ఇలా.. ఏ ఫ్లోర్ నుంచి ఏ ఫ్లోర్‌కైనా దిగొచ్చు..  అన్ని అంతస్తులు దిగొచ్చు. చూసేందుకు డిఫరెంట్‌గా ఉన్న లిఫ్ట్‌లు బాల్కనీలో బాగా పనికొస్తాయంటోంది.

Telugu news korea based neri go company invented emergency lift for safety