మిఠాయికొట్టు అమ్మాయికి బంపర్ ఆఫర్ - MicTv.in - Telugu News
mictv telugu

మిఠాయికొట్టు అమ్మాయికి బంపర్ ఆఫర్

March 13, 2018

కేరళ చిన్నది ప్రియా ప్రకాశ్ వారియర్ సోషల్ మీడియాలో రాత్రికి రాత్రి ఎలా వైరల్ అయిందో అందరికి తెలిసిందే. అలాగే దక్షిణ కొరియాకు చెందిన ఓ యువతి  అక్కడి సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది.కొరియాలో స్వీట్ల వ్యాపారం చేస్తున్న ఓ వ్యక్తికి కాలం కలసి రావడం లేదు. ఎన్ని  ప్రయత్నాలు చేస్తున్నా వ్యాపారం పుంజుకోవడం లేదు. పైగా రోజురోజుకూ అమ్మకాలు పడిపోతున్నాయి. నష్టాలు భరించలేని వ్యాపారి తన షాపును  విక్రయించాలని బావించాడు. అయితే అమ్మేసే ముందుకు అతకి ఓ ఉపాయం తట్టింది. వెంటనే అమలు చేశాడు. దుకాణంలో ఒక అందమైన అమ్మాయిని ఉద్యోగినిగా నియమించుకున్నాడు. ఈ వార్త, ఆనోటా, ఈనోటా పడి చుట్టుపక్కలే కాకుండా మొత్తం దేశమంతా  వ్యాపించింది. ఇంకేముంది ఆ యువతిని చూసేందుకు జనాలు దుకాణం ముందు బారులు తీరుతున్నారు. ఆమె మార్కెటింగ్ స్కిల్స్ చూసి వినియోగదారులు మంత్రముగ్ధులు అవుతున్నారు. కుర్రకారైతే మిఠాయిల సాకుతో ఆమెను చూడ్డానికి క్యూ కడుతున్నారు. దాంతో ఆ యువతికి విపరీతంగా అభిమానుల సంఖ్య పెరిగిపోయింది. ఆమెకు సినిమాలో కూడా అవకాశాలు వస్తున్నాయి.