తెలంగాణ మహిళా వర్సిటీగా మారనున్న ఉమెన్స్ కాలేజీ! - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణ మహిళా వర్సిటీగా మారనున్న ఉమెన్స్ కాలేజీ!

February 22, 2018

పద్మావతి ఆంధ్రప్రదేశ్ పోయిందని..కోఠి ఉమెన్స్ కాలేజీని  మరో పద్మావతిగా  తీర్చిదిద్దాలని  తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో పద్మావతి మహిళా విశ్వ విద్యాలయం ఒక్కటే ఉండేది. అయితే రాష్ట్రం విడిపోయిన తర్వాత  ఆ విశ్వవిద్యాలయం కాస్త ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లిపోయింది. అయితే వచ్చే  విద్యా సంవత్సరం నుంచి  కోఠీ ఉమెన్స్ కాలేజ్‌  తెలంగాణ మహిళా యూనివర్సిటీగా మారనుందని  విద్యాాశాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ఈరోెజు కోఠీ ఉమెన్స్ కాలేజీలో ఆయన ఆకస్మిక తనిఖీలు చేశారు. కాలేజీలో ఉన్న వసతులు పరిశీలించారు.రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణకు మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని సాయం  కోరాం అని శ్రీహరి అన్నారు. ప్రస్తుతం కోఠి ఉమెన్స్ కాలేజీలో 42 యు.జి కోర్సులు, పీజీ కోర్సులు నడుస్తున్నాయని మంత్రి స్పష్టం చేశారు.

ఉమెన్స్ కాలేజీలో  ఒక్క పరిశోధన మాత్రమే లేదని, విశ్వవిద్యాలయంగా మారితే పరిశోధన కూడా ప్రారంభం అవుతుందన్నారు. ఇటీవల ఉస్మానియా విశ్వవిద్యాలయం స్వర్ణోత్సవాల సందర్భంగా సీఎం కేసీఆర్  కోఠి ఉమెన్స్ కాలేజీకి 37 కోట్ల రూపాయలు కేటాయించినట్లు మంత్రి తెలిపారు.