బినితా జైన్ కన్నీటికథ..కేబీసీ షో అయినా గట్టెంకించేనా? - MicTv.in - Telugu News
mictv telugu

బినితా జైన్ కన్నీటికథ..కేబీసీ షో అయినా గట్టెంకించేనా?

October 2, 2018

బాలీవుడ్ దిగ్గజం అమిబాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ టీవీ షో ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పఖ్ఖర్లేదు. ఇప్పటివరకు చాలా మంది ఈ షోలో పాల్గొన్నారు. తాజాగా ఈ కార్యక్రమంలో పాల్గొని,  కోటి రూపాయలు గెలుచుకున్న బినితా జైన్ విషాదకరమైన విషయాన్ని తెలిపింది. అస్సోంకు చెందిన బినితా 2003లో తన భర్త బిజినెస్ ట్రిప్ కోసం వెళ్లిన సమయంలో ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. అతణ్ణి విడిపించేందుకు అనేక ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. అప్పడు తన పిల్లలు చాలా చిన్నవారని చెప్పంది. ఆ తర్వాత తన కుటుంబాన్ని పోషించేందుకు ట్యూషన్లు చెప్పడం ప్రారంభించానని  ఆవేదనగా చెప్పింది.

Kaun Banega Crorepati 10 finds its first crorepati in Assam's Binita Jain

‘మెదటగా 7గురు విద్యార్థులకు సోషల్,ఇంగ్లీష్ ట్యూషన్ చెప్పాను. ఇప్పడు వారి సంఖ్య 125 మందికి చేరింది. నా భర్త చనిపోయాడని అధికారులు చెప్పారు. కానీ నేను ఎక్కడో క్షేమంగా ఉంటారని అనుకుంటున్నాను’ అని ఆమె కన్నీటి వ్యధను అమితాబ్‌తో చెప్పింది. కౌన్ బనేగా కరోడ్‌పతి షోలో రూ. కోటి గెలుచుకున్న బినితా  రూ. 7కోట్ల ప్రశ్నకు సిద్దమవుతోంది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఎవరికీ ఇటువంటి అవకాశం రాలేదు.