వృద్ధ దంపతుల దారుణహత్య.. - MicTv.in - Telugu News
mictv telugu

వృద్ధ దంపతుల దారుణహత్య..

March 17, 2018

కృష్ణజిల్లా గుడివాడలో  అర్ధరాత్రి వృద్ధ దంపతులను  దొంగలు దారుణంగా హత్య చేశారు. రాజేంద్రనగర్‌లో నివాసం ఉంటున్న బొప్పన సాయిచౌదరి (72), నాగమణి (67) ఇంట్లోకి  దుండగులు చొరబడి తీవ్రంగా కొట్టి హత్య చేశారు. ఆ తర్వాత ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలు, నగదు దోచుకెళ్లారు. ఇంటి ముందు పార్కింగ్ చేసి ఉన్న కారును కూడా  ఎత్తుకెళ్లారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అనుమాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.హాల్‌లో రక్తం మడుగులో పడి ఉన్న మృతదేహాలను స్వాధీనం చేసుకుని, పోస్ట్‌‌మార్టంకు తరలించారు.  మరోవైపు రంగంలోకి దిగిన క్లూస్‌‌టీం ఆధారాలు సేకరిస్తోంది. నిందితుల ఆచూకీ కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. కాగా ఈ హత్యకు పాల్పడింది దోపిడీ దొంగలా లేక  ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు.ఈ ఘటన కలకలం రేపడంతో ఘటనా స్థలానికి పెద్ద ఎత్తున స్థానికులు చేరుకున్నారు. మరోవైపు జిల్లా ఎస్పీ త్రిపాఠి సంఘటనా స్థలానికి చేరుకుని, పరిస్థితిని సమీక్షిస్తున్నారు.