కృష్ణ మనవడు హీరోగా తెరంగేట్రం.. - MicTv.in - Telugu News
mictv telugu

కృష్ణ మనవడు హీరోగా తెరంగేట్రం..

March 1, 2018

మనదేశంలో రాజకీయాలే కాదు సినిమా, వ్యాపారం వంటి మరెన్నో రంగాల్లోనూ వారసత్వం మర్రిచెట్టు ఊడళ్లా వేళ్లూనుకుని ఉంది. టాలెంట్, ప్రజాదరణతో సంబంధం లేకుండా వారసత్వాలు అలా కొనసాగిపోతుంటాయి. అయితే కాస్త ఆలస్యమైనా  జనమే అంతిమంగా ఎవరేమిటో తేల్చేస్తుంటారు.

విషయం ఏమంటే తెలుగులో ఓ స్టార్ హీరో మనవడు తెరంగేట్రం చేయబోతున్నాడు. సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు రమేశ్ బాబు గుర్తున్నాడా? ఆయన చాక్లెట్ బాయ్  మహేశ్ బాబు కంటే ముందుగానే తెలుగులో సినిమాల్లో నటించాడు. కానీ ఆయన సినిమాలు విజయం సాధించకపోవడంతో సినిమా రంగానికి గుడ్ బై చెప్పాడు. ఇప్పుడు రమేశ్  తనయుడు జయకృష్ణ  హీరోగా తెలుగు తెరకు పరిచయం కానున్నట్టు తెలుస్తోంది.

సినిమాల్లో నటించడానికే జయకృష్ణ వైజాగ్‌లోని సత్యానంద్ దగ్గర శిక్షణ తీసుకుంటున్నాడని సమాచారం. కృష్ణ కుటుంబమే వచ్చే ఏడాది జయకృష్ణతో ఓ సినిమా నిర్మించబోతోంది. ఈ అబ్బాయి తాతల,బాబాయ్‌లా ఇరగదీస్తాడో లేదో చూడాలి మరి.