ఏపీలో ఘనంగా కేసీఆర్ బర్త్ డే.. ఫ్లెక్సీ కట్టి, చీరలు పంచి.. - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీలో ఘనంగా కేసీఆర్ బర్త్ డే.. ఫ్లెక్సీ కట్టి, చీరలు పంచి..

February 17, 2018

కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు మిన్నంటుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎంకు జేజేలు పలుకుతున్నారు. రక్తదానాలు, అన్నదానాలతో అభిమానాన్ని చాటుకుంటున్నారు. కేసీఆర్ ఫ్యాన్స్ తెలంగాణాలోనే కాదు ఆంధ్ర ప్రదేశ్‌లోనూ వున్నారు.

 గుంటూరు జిల్లా తెనాలిలో ఖదీర్ అనే వ్యక్తి కేసీఆర్‌కు వీరాభిమాని. ప్రతీ సంవత్సరం కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తుంటాడు. ఈసారి కూడా తన అభిమాన నాయకుడి బర్త్‌డేను అంగరంగ వైభవంగా నిర్వహించాడు.

ఖదీర్ స్థానికంగా పలు సేవా కార్యక్రమాలు కూడా చేపట్టడం విశేషం. పట్టణంలో పెద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేశాడు. అంతేకాదు అనాథాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించాడు. అలాగే కేక్ కట్ చేసి… అందరితో కలసి సంబురం చేసుకున్నాడు.

పేద మహిళలకు చీరలు పంపిణీ చేసి దాతృహృదయాన్ని చాటుకున్నాడు. కేసీఆర్ తన దృష్టిలో తెలంగాణ హీరో అని అన్నాడు ఖదీర్.  ‘ప్రత్యేక రాష్ట్రం కోసం మడమ తిప్పని యోధుడిలా పోరాడి గెలిచారు. ఆయనొక అలుపెరగని ఉద్యమనేత. ఆయన్ని చూసి ఆంధ్ర నాయకులు సిగ్గు తెచ్చుకోవాలి. ఆంధ్ర రాష్ట్ర ప్రత్యేక హోదా కోసం కేసీఆర్‌తో స్ఫూర్తి పొందాలి ’ అన్నాడు ఖదీర్.