పత్రికలు పంచుతున్న కేటీఆర్ - MicTv.in - Telugu News
mictv telugu

పత్రికలు పంచుతున్న కేటీఆర్

November 23, 2017

నవంబర్ 28న హైదరాబాద్ లో మెట్రో రైలు ప్రధాని చేతుల మీదుగా ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే. అయితే ప్రారంభానికి సంబంధించి తెలంగాణ  ఐటి మంత్రి కేటీఆర్ ఢిల్లీలో బిజీ బిజీగా ఉన్నారు. మెట్రో ప్రారంభానికి  రావాల్సిందిగా  కేంద్ర పట్టణాభివృద్ది హర్ దీప్ సింగ్ ను కోరారు.ఈసందర్భంగా తెలంగాణలో డ‌బుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం, డ్రింకింగ్ వాట‌ర్, అన్ని మున్సిపాలిటీల‌ను వంద శాతం ఓడిఎఫ్ గా మార్చడానికి చేసిన‌ కృషిని కేంద్ర మంత్రికి వివరించామని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తోన్న అభివృద్ధిని క్షేత్ర స్థాయిలో చూడాల‌ని ఉంద‌ని కేంద్ర మంత్రి అన్నారని  కేటీఆర్ మీడియాతో పంచుకున్నారు. మెట్రో ప్రారంభానికి  ఢిల్లీలో ఉన్న  చాలామంది రాజకీయ పెద్దలను ఆహ్వానించినట్లు కేటీఆర్ తెలిపారు.