మహిళా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహిస్తాం - MicTv.in - Telugu News
mictv telugu

మహిళా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహిస్తాం

November 30, 2017

తెలంగాణ రాష్ట్రంలో మహిళా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహిస్తామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సు ముగింపు సమావేశంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘జీఈఎస్ విజయవంతం కావడంలో నీతి ఆయోగ్ కీలక పాత్ర పోషించిందని’ మంత్రి కొనియాడారు. జీఈ సదస్సును ప్రారంభించిన ప్రధాని మోదీకి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.సదస్సులో మూడు రోజుల పాటు 53 డిస్కసన్లలో 200 మంది స్పీకర్లు మాట్లాడినట్లు మంత్రి వెల్లడించారు. తెలంగాణలో మహిళా పారిశ్రామిక వేత్తల సంఖ్య మరింత పెరగాలని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సదస్సు వల్ల భారత్ – అమెరికా మైత్రి మరింత బలపడుతుందన్నారు. టీ హబ్‌ను ప్రధాని మోదీ, ఇవాంక ట్రంప్ ప్రశంసించారని మంత్రి తెలిపారు. ఈ సదస్సు ద్వారా చాలా విషయాలు నేర్చుకున్నామని మంత్రి చెప్పారు. టీ హబ్ ద్వారా 4 రాష్ర్టాలకు మార్గదర్శనం చేస్తున్నట్టు మంత్రి వివరించారు. ప్రొక్యూర్‌మెంట్ విధానంలో మహిళలు నిర్వహించే ఎస్‌ఎంఈలకు అవకాశం ఇస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఎంట్రీప్రెన్యూర్లకు రాష్ట్ర ప్రభుత్వం టీ ఫండ్‌తో చేయూతనందిస్తున్నదని మంత్రి చెప్పారు. ఎంట్రీప్రెన్యూర్లను జీఈ సదస్సు ఓ మంచి వేదికలా నిలిచిందని మంత్రి  కేటీఆర్ ఈ సందర్భంగా తెలిపారు.