‘C/O కంచరపాలెం’ చిత్రానికి అండగా నిలిచిన కేటీఆర్

C/O కంచర పాలెం… తెలుగు చిత్రసీమలో ఓ మరుపురాని దృశ్యకావ్యం. వెంకటేష్ మహా అనే దర్శకుడు తెరకెక్కించిన ఈ చిత్రం ఎంతో పేరు తెచ్చుకుంది. సామాన్య ప్రేక్షకులతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను సైతం తన మాయలో పాడేసుకుంది. జాతీయ అవార్డులలో సత్తా చాటుతుందని అందరూ ఊహించారు. కానీ, ఇటీవల ఈ చిత్రాన్ని జాతీయ అవార్డుల జ్యూరీ తిరస్కరించింది. కారణం.. ఈ చిత్ర నిర్మాత అయిన పరుచూరి ప్రవీణ ఓ ప్రవాసభారతీయురాలు కావడం, ఆమె అమెరికా గ్రీన్ కార్డు కలిగి ఉండడం. దీనితో ఈ చిత్ర బృందం ఎంతో నిరాశ చెందింది.  దర్శకుడు వెంకటేష్ మహా, ప్రవీణలు ఎంతో బాధగా ఈ విషయాన్నీ ట్విట్టర్‌లో వెల్లడించారు.

జాతీయ అవార్డుల నిబంధనల ప్రకారం కేవలం భారతీయులు నిర్మించిన చిత్రాలను మాత్రమే జాతీయ అవార్డుల కోసం పరిగణిస్తారు. అయితే ఈ పాత నిబంధలనలను ప్రభుత్వం ప్రక్కనబెట్టి కంచరపాలెం చిత్రాన్ని జాతీయ అవార్డుల కోసం పరిగణించాలని ఎందరో కోరుతున్నారు. వారిలో ఒకరయ్యారు తెలంగాణ మాజీ ఐటీ మంత్రి కేటీఆర్. ఆయన ఈరోజు ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్నీ వెల్లడించారు. జాతీయ అవార్డులు చిత్రకారుల గౌరవానికి సంబంధించిన అంశమని, కొన్ని నిబంధనల వలన ఇండియాలో నిర్మితమైన చిత్రాన్ని అవార్డుల కోసం పరిగణించకపోవడం సరికాదని తెలిపారు. ఈ విధంగా కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ, రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్‌లకు ట్విట్టర్‌లో అప్పీల్ చేశారు.

Telugu News KTR appeals to Centre after 'C/O Kancharapalem' is disqualified from National Awards