మీ సంగతి మీరు చూస్కోండి..చంద్రబాబుకు  కేటీఆర్ కౌంటర్ - MicTv.in - Telugu News
mictv telugu

మీ సంగతి మీరు చూస్కోండి..చంద్రబాబుకు  కేటీఆర్ కౌంటర్

March 14, 2018

‘సెంటిమెంటుతో తెలంగాణ ఇచ్చారు కదా.. అదే సెంటిమెంటుతో ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వొచ్చు కదా ’ అన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ట్వీట్‌పై తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. ‘ సర్ తెలంగాణా ప్రజలకు ఆత్మగౌరవం వుంది. ఎవరు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా, నజరానాాల ఆశజూపినా మేము మా తెలంగాణ నినాదాన్ని విస్మరించలేదు.

మా పోరాటాన్ని చాలా మంది నీరుగార్చే ప్రయత్నం చేసినప్పటికీ మేమంతా ఒకేతాటిపై వుండి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. మీ హక్కుల కోసం మీరు పోరాటం చేయండి కానీ తెలంగాణ ప్రజల పోరాటం, త్యాగాలను తక్కువచేసి మాట్లాడకండి’ అంటూ రీట్వీట్ చేశారు.

https://twitter.com/KTRTRS/status/973604621703823360  

సెంటిమెంట్‌తో డబ్బులు రాలవు ’ అని గతవారం కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఏపీకి ప్రత్యేకహోదాపై ఆయన చేసిన వ్యాఖ్యలపై ఏపీ సీఎం చంద్రబాబు ట్విటర్ ద్వారా విమర్శించారు. దానికి కౌంటర్‌గా కేటీఆర్ స్పందించారు. ఇదిలా వుండగా నవ్యాంధ్రకు న్యాయం చేయాలంటూ ఏపీ అసెంబ్లీలో మంగళవారం తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం చంద్రబాబు మాట్లాడుతూ… అరుణ్ జైట్లీ వ్యాఖ్యలపై తీవ్ర అసహనాన్ని ప్రకటించారు.

పెంటిమెంట్లతో నిధులు ఇవ్వలేమని చెప్పిన కేంద్ర ఆర్థిక మంత్రి వ్యాఖ్యలపై చంద్రబాబు ప్రసంగించారు. ‘ 60 ఏళ్ళు కష్టపడి కట్టుబట్టలతో వచ్చినవారికి సెంటిమెంటుతో నిధులు ఇవ్వరా ? వారు ప్రత్యేకహోదా ఇస్తామంటేనే పొత్తు పెట్టుకున్నామనే విషయాన్ని మరిచిపోయారు. లోటు బడ్జెట్‌లో వున్న ఈ రాష్ట్రం స్థితిగతులను వారు అర్థం చేసుకుంటే మంచిది ’ అని అన్నారు.