ఇంకోసారి బచ్చా అని అన్నారో….ఇక చూడండి! - MicTv.in - Telugu News
mictv telugu

ఇంకోసారి బచ్చా అని అన్నారో….ఇక చూడండి!

March 2, 2018

తెలంగాణ ఐటీ  మంత్రి కేటీఆర్  కాంగ్రెస్ నేతలను హెచ్చరించారు. ‘ఇంకోసారి తనను బచ్చా అని అంటే  ఏం సమాధానం చెబుతానో చూడండి’ అని హెచ్చరించారు. తాను సూట్ వేసుకుని మాట్లాడితే  అమెరికా భాష అని  విమర్శిస్తారు, ప్రజల భాషలో మాట్లాడితే మరోలా విమర్శిస్తారు. నేను కాంగ్రెస నేతల గురించి అన్ని నిజాలే మాట్లాడాను.  కేసీఆర్ అన్ని జిల్లాల్లో పర్యటించి చేస్తోన్న అభివృద్ది కార్యక్రమాలు చూసి  ఏం చెయాలో తెలీక  కాంగ్రెస్ నేతల ఇలా విమర్శలు చేస్తున్నారు. అయోమయంలో పడ్డారు’ అని కేటీఆర్ అన్నారు.

కాంగ్రెస్ నేత షబ్బీర్  ఆలీ, ఇంకా  పలువురు నేతలు కూడా‘ కేటీఆర్ ఓ బచ్చా అని వ్యాఖ్యలు చేయగా, జానారెడ్డి మాత్రం  కేటీఆర్ గురించి తాను స్పందించి ఆయన స్థాయికి దిగజారలేనని  అని అన్నారు.