ఉత్తమ్‌కు కేటీఆర్ రాజకీయ సన్యాసం సవాల్ ! - MicTv.in - Telugu News
mictv telugu

ఉత్తమ్‌కు కేటీఆర్ రాజకీయ సన్యాసం సవాల్ !

January 31, 2018

జోగులాంబ గద్వాల్ జిల్లాలో పర్యటించిన తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్.. జిల్లాలోని చేనేత పార్క్‌కు, పరిపాలన భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఆతర్వాత ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ‘ 2019లో మాకు డెబ్బై సీట్లు వస్తాయని కాంగ్రెస్ నేత ఉత్తమ్‌కుమార్’రెడ్డి చెబుతున్నారు.

అయితే ఆయనకు నేనో సవాల్ విసురుతున్నాను…2019 టీఆర్ఎస్ అధికారంలోకి రాకపోతే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా. మరి కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డిగారు మీరు రాజకీయ సన్యాసం తీసుకుంటారా? గడ్డాలు పెంచినంత మాత్రాన అధికారం రాదు..అట్లైతే అందరూ గడ్డాలు పెంచుకునే పనిలోనే ఉంటారు.

వచ్చే ఎన్నికల్లో నూటికి నూరు శాతం గులాబీ జెండానే ఎగురుతుంది. కాంగ్రెస్ ఏం చేసిందని ప్రజలు ఓట్లు వేస్తారు?  దేశం మొత్తం కాంగ్రెస్ కు ఎదురు గాలి వీస్తోంది’ అని కేటీఆర్ అన్నారు.