‘కేటీఆరే స్కాంస్టర్.. ఇదిగో సాక్ష్యం..’ - MicTv.in - Telugu News
mictv telugu

‘కేటీఆరే స్కాంస్టర్.. ఇదిగో సాక్ష్యం..’

November 2, 2017

మంత్రి కేటీఆర్‌కు, రేవంత్‌ రెడ్డికి మధ్య మాటల యుద్ధం మొదలైంది.  ఓటుకు నోట్లు కేసులో రేవంత్ తెలంగాణ పరువు తీశాడని కేటీర్ మరోసారి ధ్వజమెత్తారు.ఈసారి కొడంగల్ ఎన్నికలు ఎప్పుడు జరిగినా అక్కడ టీఆర్ఎస్‌దే విజయమని ఆశాభావం వ్యక్తం చేశారు. రేవంత్ పెద్ద ‘ స్కాంస్టార్ ’ అని ఆరోపించారు. దీనికి రేవంత్ కూడా బదులిచ్చారు. ‘కేటీఆరే పెద్ద స్కాంస్టర్ ’ అని తన ఫేస్‌బుక్ వేదికగా సమాధానం చెప్పారు రేవంత్. తన ఆరోపణలకు రుజువుగా ఒక ఫోటోను కూడా బయట పెట్టారు. అందులో సత్యం రామలింగరాజు తనయుడు తేజా రిజుతో పాటు మలేసియా ప్రధాని నజీబ్ రజాక్‌ను కేటీఆర్ కలిసినప్పటి ఫోటోను బయట పెట్టారు. ‘ఇదిగో కేటీఆర్‌ దాచిన సత్యం’ శీర్షికతో ఈ ఫోటోను తన ఎఫ్‌బీ వాల్ మీద పోస్టు చేశారు. పోస్టుతో పాటు ‘2016లో అధికారిక పర్యటనకు వెళ్లి అనధికారికంగా తేజా రాజుతో మలేసియా ప్రధానిని కలిసిన కేటీఆర్‌కు ముందుంది మొసళ్ళ పండగ ’ అని వెటకారంగా కామెంటును జోడించారు.