ఆల్‌ ద బెస్ట్ కమల్ జీ.. కేటీఆర్ - MicTv.in - Telugu News
mictv telugu

ఆల్‌ ద బెస్ట్ కమల్ జీ.. కేటీఆర్

February 21, 2018

దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంను ఆదర్శంగా తీసుకుని కమల్  తన రాజకీయ యాత్రను   మొదలు పెట్టిన విషయం తెలిసిందే.  కమల్ రాజకీయ రంగప్రవేశంపై  తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్  ట్వీట్ చేశారు. ‘బుధవారం మదురైలో నిర్వహించబోతున్న సభకు నన్ను పిలిచినందుకు ధన్యవాదాలు.  నేను ఈ కార్యక్రమానికి రాలేకపోతున్నాను. కానీ  మీరు ప్రారంభించబోయే  నూతన ప్రస్థానం విజయవంతం కావాలని  కోరుకుంటున్నాను.. మీరు నిజజీవితంలోనూ నాయకన్ కావాలని కోరుకుంటున్నానను’ అని  కేటీఆర్  ట్వీట్ చేశారు.

ఈరోజు జరిగే  కమల్  బహిరంగసభకు ఢిల్లీ ముఖ్యమంత్రి  అరవింద్‌ కేజ్రీవాల్‌తోపాటు పలువురు, రాజకీయనేతలు రాబోతున్నారు. కమల్ సభలో పార్టీ లక్ష్యాలను వివరించి, పతాకాన్ని ఆవిష్కరించి పార్టీ పేరును ప్రకటించనున్నారు.